ఒంటరిగా ఉండలేకపోతున్నా... రెండోపెళ్లి చేస్కోవాలని చూస్తున్నా... మనీషా కొయిరాలా...
నెల్లూరు నెరజాణ... అనే పాటతో తెలుగు రాష్ట్రాల్లో ఆమధ్య ఓ ఊపు ఊపిన నటి మనీషా కొయిరాలా. బొంబాయి, ఒకే ఒక్కడు, క్రిమినల్ వంటి హిట్ చిత్రాల్లో నటించిన మనీషా కొయిరాలా రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నదట. నేపాల్ దేశానికి చెందిన మనీషా, బాలీవుడ్ ఇండస్ట
నెల్లూరు నెరజాణ... అనే పాటతో తెలుగు రాష్ట్రాల్లో ఆమధ్య ఓ ఊపు ఊపిన నటి మనీషా కొయిరాలా. బొంబాయి, ఒకే ఒక్కడు, క్రిమినల్ వంటి హిట్ చిత్రాల్లో నటించిన మనీషా కొయిరాలా రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నదట. నేపాల్ దేశానికి చెందిన మనీషా, బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచిమంచి అవకాశాలనే రాబట్టింది. ఆ తర్వాత దురదృష్టవశాత్తూ కేన్సర్ వ్యాధి బారిన పడింది.
ఐతే వెంటనే అమెరికా వెళ్లి వ్యాధికి చికిత్స చేయించుకుంది. వ్యాధి తగ్గిపోవడంతో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. అలాగే ఒంటరిగా జీవితాన్ని గడపడం బోరింగుగా ఉందనీ, అందువల్ల రెండో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు వెల్లడించింది. ఐతే మనీషా ఈ రెండో పెళ్లి చేసుకునైనా కుదురుగా ఉంటుందా లేక మళ్లీ విడాకులు అంటుందోనని బాలీవుడ్ సినీజనం అనుకుంటున్నారట.