పూరీతో నాకేమి లింకు లేదు… టైమ్ వేస్ట్ అంటున్న ముమైత్ ఖాన్
పోకిరి సినిమాలో ఇప్పటికింకా నా వయసు.. నిండా పదహారే అంటూ ముమైత్ వేసిన చిందులను ఆడియన్స్ ఇప్పటికి మర్చిపోలేరు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాతోనే ముమైత్ ఖాన్ టాలీవుడ్ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగ
పోకిరి సినిమాలో ఇప్పటికింకా నా వయసు.. నిండా పదహారే అంటూ ముమైత్ వేసిన చిందులను ఆడియన్స్ ఇప్పటికి మర్చిపోలేరు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాతోనే ముమైత్ ఖాన్ టాలీవుడ్ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిపోయింది. ఆ సినిమాలో చేసిన ఐటెం సాంగ్ ఆమె కెరీర్‌ని తారాస్థాయికి తీసుకెళ్లింది. ఆ తర్వాత ఐటెం సాంగ్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.
ఈ క్రమంలో పోకిరి దర్శకుడు పూరీతో ముమైత్ ఎఫైర్ ఉందనే పుకార్లు కూడా టాలీవుడ్‌లో చక్కర్లు కొట్టాయి. ఈ పుకార్లను ముమైత్ లైట్‌గానే తీసుకుంది. కానీ తాజాగా అదే పనిగా వస్తున్న పుకార్లపై ఈ భామ తనదైన శైలిలో స్పందించింది. ''దర్శకుడు పూరి జగన్నాథ్‌తో తనకు ఎఫైర్ ఉన్నదని వచ్చే వార్తల్లో నిజం లేదని అంటోంది. పూరి నాకు మంచి స్నేహితుడు మాత్రమే. అంతకు మించి మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు.
పోకిరి చేసినప్పటి నుంచీ ఆయనతో మంచి స్నేహం కుదిరిందని, కాస్త చనువుగా ఉంటే ఇటువంటి వార్తలు రావడం సహజమేనని.. అయితే, ఇప్పటివరకు ఈ రూమర్స్‌ను నేను పెద్దగా పట్టించుకోలేదని, ఇలా ప్రచారం జరిగినప్పుడల్లా వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని, ఇలా చేస్తే సమయం టైమ్ వేస్ట్ తప్ప ఉపయోగమేమీ ఉండదని'' ముమైత్ ఖాన్ అభిప్రాయపడింది. ఈ మధ్య కాలంలో ఈ పుకార్లు శృతిమించడంతోనే మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని తన మనసులోని మాటను వెల్లడించింది.