1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : గురువారం, 6 అక్టోబరు 2016 (10:48 IST)

మోకాళ్లపై నిలబడి డైమండ్ రింగ్‌తో ప్రపోజ్ చేశాడు : నిఖిత

''హాయ్‌'' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి నిఖిత. ''కళ్యాణ రాముడు'', ''సంబరం'', ''ఖుషి ఖుషిగా''.. మొన్న వచ్చిన శ్రీకాంత్ ''టెర్రర్'' వరకు తెలుగు సినిమాలలో నటించి మంచి పేరును సంపాదించుకుంది. త

''హాయ్‌'' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి నిఖిత. ''కళ్యాణ రాముడు'', ''సంబరం'', ''ఖుషి ఖుషిగా''.. మొన్న వచ్చిన శ్రీకాంత్ ''టెర్రర్'' వరకు తెలుగు సినిమాలలో నటించి మంచి పేరును సంపాదించుకుంది. తెలుగు సినిమాలతో పాటు.. కన్నడ.. తమిళ్.. మలయాళ సినిమాల్లో కూడా మెరిసిపోయింది. అయితే ఈ ముద్దు గుమ్మ సినిమా జీవితానికి పుల్‌స్టాప్ పెట్టి వైవాహిక జీవితంలో అడుగుపెట్టబోతోంది. ముంబైకి చెందిన బిజినెస్ మెన్ గగన్‌దీప్‌ సింగ్‌ మగోతో నిఖిత వివాహం జరగనుంది. 
 
అక్టోబర్ 9న ముంబైకి చెందిన వ్యాపారవేత్త గగన్‌దీప్‌సింగ్, హీరోయిన్ నిఖితాల పెళ్లికి ఇరువురి కుటుంబాలు ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. ఈ దసరాకి జరగనుందని ఆమె స్వయంగా తెలిపారు. గురువారం నుంచి మెహందీ, సంగీత్‌ వంటి కార్యక్రమాలు మొదలుకాగా, శనివారం మ్యారేజ్ జరగనుంది. ఈ ఫంక్షన్‌కి ఇరు కుటుంబాలతోపాటు రాజకీయ, సినీ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. కాంగ్రెస్‌నేత, వ్యాపారవేత్త అయిన మహీందర్‌ సింగ్‌ మగో కుమారుడే ఈ గగన్‌సింగ్‌. గగన్ గురించి నిఖిత తెలుపుతూ.. గత యేడాది డిసెంబరులో నా కజిన్‌ వివాహంలో మొదటసారి గగన్‌ని కలిశానని చెప్పింది.
 
అప్పుడే అతడు నన్ను ఇష్టపడ్డాడని చెప్పుకొచ్చింది. గగన్ కూడా నా సోదరిని అడిగే నాతో మాట్లాడాడని ఆమె చెప్పింది. నేను హోమ్లీగా ఉండడంతో అతడు నన్ను ప్రేమించాడు. అదే రోజు నాకు తన ప్రేమ విషయం కూడా చెప్పాడు. నా భావాలను గగన్‌ అర్థం చేసుకుని నా కోసం వాళ్ల ఇంట్లో ప్రత్యేకంగా ఓ పూజ గదిని ఏర్పాటు చేశాడు. అతడే నాకు కాబోయే భర్త, అతడు లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేను. ముంబయి రెస్టారెంట్‌లో మోకాళ్ళపై నిలబడి డైమండ్‌ రింగ్‌తో నాకు తన ప్రపోజ్‌ చేశాడు'' అని నిఖిత చెప్పుకొచ్చింది.