ఆ హీరోయిన్ కోసం పవన్ సపోర్ట్ కోరుతున్న నితిన్.. నిజమా...?
పవన్ కళ్యాణ్ పిచ్చ అభిమాని యంగ్ హీరో నితిన్ ఈమధ్య చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నాడు. వచ్చిన సినిమాలు వచ్చినట్లు కాకుండా నచ్చిన కథలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఇంకో విచిత్రం ఏమిటంటే.. తనతో నటించే హీరోయిన్లను కాస్త ముదురు భామలను చూసుకుంటున్నాడు.
పవన్ కళ్యాణ్ పిచ్చ అభిమాని అయిన యంగ్ హీరో నితిన్ ఈమధ్య చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నాడు. వచ్చిన సినిమాలు వచ్చినట్లు కాకుండా నచ్చిన కథలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఇంకో విచిత్రం ఏమిటంటే.. తనతో నటించే హీరోయిన్లను కాస్త ముదురు భామలను చూసుకుంటున్నాడు. అలాగే సమంతతో అ.. ఆ సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు. తాజాగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించినట్లు సమాచారం.
ఐతే ఈ చిత్రంలో తన సరసన నటించే హీరోయిన్ కోసం దర్శకుడు కొన్ని పేర్లు చెబితే... అవన్నీ కాదనీ గబ్బర్ సింగ్ హీరోయిన్ శ్రుతి హాసన్‌ను నేరుగా నితిన్ సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఐతే ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదట. ఎలాగూ కాటమ రాయుడు చిత్రంలో తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ పక్కన ఆమే నటిస్తుంది కాబట్టి, విషయాన్ని పవన్ దృష్టికి తీసుకెళితే పని సుళువవుతుందని అనుకుంటున్నట్లు టాలీవుడ్ జనం చెప్పుకుంటున్నారు. నితిన్ అడిగితే పవన్ కాదంటారా... శ్రుతి హాసన్ ఖచ్చితంగా ఒప్పుకోదూ...?!!