బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 12 అక్టోబరు 2023 (13:16 IST)

"గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి"లో విశ్వక్ సేన్ కోసం నోరా ఫతేహి డ్యాన్స్

Nora Fatehi
కెనడియన్ నటి , డ్యాన్సర్ నోరా ఫతేహి రాబోయే చిత్రం "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి"లో తన ప్రత్యేక పాటతో తెరపైకి రావడానికి సిద్ధంగా ఉంది. నోరా ఫతేహి, ఆమె సిజ్లింగ్ డ్యాన్స్ మూవ్‌లు ప్రేక్షకులను ఆకట్టుకుంది. 
 
నోరా ఫతేహి ఇంతకుముందు టెంపర్, బాహుబలి, కిక్ 2, లోఫర్, ఊపిరి వంటి తెలుగు చిత్రాలలో ఐటమ్ గర్ల్‌గా కనిపించింది. తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో ఆమె ప్రత్యేక పాట కోసం చిందులేయనుంది. ఈ పాట సినిమాకు హైలైట్‌గా వుంటుందని టాక్ వస్తోంది. 
 
ఈ చిత్రంలో విశ్వక్ సేన్, అంజలి, నేహా శెట్టి ప్రధాన పాత్రలలో నటించారు. వీరితో పాటు సాయి కుమార్, నాసర్, గోపరాజు రమణ వంటి నటులు కూడా కీలక పాత్ర పోషించారు. ఇకపోతే.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డిసెంబర్ 8న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.