శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 అక్టోబరు 2023 (19:35 IST)

అక్టోబర్ 14న భారత్-పాక్ మ్యాచ్.. అహ్మదాబాద్‌కు వందే భారత్ రైలు

vande bharat
వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున అహ్మదాబాద్‌కు తరలి రానున్నారు. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.
 
భారత్-పాక్ మ్యాచ్ జరిగే రోజున మధ్యప్రదేశ్, రాజస్థాన్ మహారాష్ట్రల నుంచి అహ్మదాబాద్‌కు ప్రత్యేక వందే భారత్ రైళ్లను నడపనున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. 
 
ఆ రోజున వందే భారత్ రైలును నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే రైళ్ల షెడ్యూల్, టిక్కెట్ ధరల వివరాలు వెల్లడి కానున్నాయి.