ఐసీసీ వరల్డ్ కప్ వార్మప్- భారత్-ఇంగ్లండ్ మ్యాచ్ రద్దు
ఐసీసీ వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఇంగ్లండ్ తో టీమిండియా ఆడాల్సిన వార్మప్ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న గువాహటిలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. దాంతో, టీమిండియా, ఇంగ్లండ్ జట్లు ఎలాంటి ప్రాక్టీసు లేకుండానే వెనుదిరిగాయి.
అక్టోబరు 5 నుంచి భారత్ లో వరల్డ్ కప్ పోటీలు జరగనుండగా, ప్రస్తుతం వార్మప్ మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఆస్ట్రేలియా జట్టు నెదర్లాండ్స్ తో తలపడుతోంది. తిరువనంతపురంలో వర్షం కారణంగా ఈ మ్యాచ్ ను 23 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. 23 ఓవర్లలో 7 వికెట్లకు 166 పరుగులు చేసింది.