శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 సెప్టెంబరు 2023 (13:41 IST)

పాక్ క్రికెటర్ షాదాబ్ ఖాన్ మేనత్త మృతి

Shadab Khan
Shadab Khan
పాక్ క్రికెటర్ షాదాబ్ ఖాన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. షాదాబ్ మేనత్త కన్నుమూశారు. వరల్డ్ కప్​లో​ ఆడేందుకు భారత్​కు వచ్చిన షాదాబ్.. తన మేనత్త చనిపోయారనే విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. మేనత్త ఆత్మకు శాంతి చేకూరాలని, అందుకు ప్రార్థనలు చేయాలని అభిమానులను షాదాబ్ ఖాన్ కోరాడు. 
 
అయితే ఆమె ఎలా చనిపోయిందనే విషయాన్ని మాత్రం అతడు స్పష్టం చేయలేదు. దాబ్ ఇంట్లో విషాదం నెలకొనడంపై పాక్ ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. అతడి మేనత్త ఆత్మకు శాంతి చేకూరాలని కామెంట్స్ చేస్తున్నారు.