1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 అక్టోబరు 2023 (22:41 IST)

రచిన్ రవీంద్ర, కాన్వే సెంచరీల మోత... ఇంగ్లండ్ జట్టుపై ఘనవిజయం.. ఆంధ్రాలో?

Rachin Ravindra
Rachin Ravindra
ఐసీసీ ప్రపంచ కప్ -2023లో కివీస్ ఆటగాళ్లు ఇంగ్లండ్ జట్టుకు చుక్కలు చూపించారు. క్రికెట్‌లో పసికూనగా పేరున్న కివీస్.. డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌కు చెక్ పెట్టింది. గురువారం ఇంగ్లండ్‌తో జరిగిన ఐసీసీ వరల్డ్ కప్-2023 తొలి మ్యాచ్‌లో కివీస్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించాడు. ఈ మ్యాచ్‌కు కివీస్ ఆటగాళ్లు కాన్వే, రచిన్ రవీంద్ర సెంచరీల మోత మోగించి న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు.  
 
గత ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ జట్టు ప్రపంచ కప్ నెగ్గింది. అయితే ఈసారి తొలి మ్యాచ్‌లోనే తేలిపోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 282 పరుగులు చేయగా, న్యూజిలాండ్ లక్ష్యఛేదనలో ఓపెనర్ డెవాన్ కాన్వే, వన్ డౌన్ బ్యాట్స్ మన్ రచిన్ రవీంద్ర సెంచరీలతో కదం తొక్కారు. ఓపెనర్ విల్ యంగ్ డకౌట్ అయినా, ఈ ఇద్దరూ జట్టును విజయ పథం వైపు నడిపించారు. 
 
ఈ జంట అద్భుత బ్యాటింగ్‌తో‌ న్యూజిలాండ్ 283 పరుగుల లక్ష్యాన్ని కేవలం 36.2 ఓవర్లలో ఛేదించింది. కాన్వే 121 బంతుల్లో 19 ఫోర్లు, 3 సిక్సర్లతో 152 పరుగులు చేయగా, రచిన్ రవీంద్ర 96 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 123 పరుగులు చేశాడు. 
 
ఈ జోడీని విడదీయడానికి ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ఆరుగురు బౌలర్లను ఉపయోగించినా ఫలితం శూన్యంగా మారింది. ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టుకు కేన్ విలియమ్సన్ గైర్హాజరీలో వికెట్ కీపర్ టామ్ లాథమ్ నాయకత్వం వహించాడు. 23 ఏళ్ల రచిన్ రవీంద్ర 96 బంతుల్లో 123 పరుగులు సాధించాడు. భారత సంతతి ఆటగాడైన రచిన్ రవీంద్ర, న్యూజిలాండ్ ద్వారా టీమిండియాతో మ్యాచ్‌లోనే టెస్టు అరంగ్రేటం చేశాడు. 
 
ఇప్పటిదాకా 18 టీ20, 13 వన్డే మ్యాచులు ఆడిన రచిన్ రవీంద్ర, బ్యాటుతో 26 వికెట్లు తీశాడు. 23 ఏళ్ల రచిన్ రవీంద్ర తల్లిదండ్రులు భారతీయులే. బెంగళూరుకి చెందిన రచిన్ రవీంద్ర తండ్రి రవి కృష్ణమూర్తి, 1990ల్లోనే న్యూజిలాండ్‌కి వెళ్లి అక్కడే సెటిల్ అయ్యాడు. ప్రతీ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఉన్న రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఆర్‌డీటీ)కి వచ్చి క్రికెట్ ఆడతుండేవాడు.