సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Updated : మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (15:46 IST)

చరణ్ చెప్పింది ఎన్టీఆర్‌కి నచ్చలేదు, ఏం చేసాడో తెలుసా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ వీరిద్దరూ కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ఆర్ఆర్ఆర్ 2021 జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో నటిస్తున్నప్పటి నుంచి ఎన్టీఆర్ - చరణ్‌ వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. 
 
ఆ చనువుతో చరణ్‌.. ఎన్టీఆర్‌కు ఓ సలహా ఇచ్చారు. అది ఏంటంటే... ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయమని. చరణ్‌ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌ని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇదే సలహాని చరణ్‌, ప్రభాస్ - రాజమౌళికి కూడా ఇచ్చారని.. ప్రభాస్, రాజమౌళి కలిసి ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించనున్నారని వార్తలు వచ్చాయి. చరణ్‌ సలహాతో ఎన్టీఆర్ కూడా నిర్మాణ సంస్థను స్టార్ట్ చేయాలనుకుంటున్నారని... తన తండ్రి హరికృష్ణ, తనయుడు అభయ్ రామ్ పేరు మీద ఎన్టీఆర్ నిర్మాణ సంస్థను ప్రారంభిస్తారని జోరుగా ప్రచారం జరిగింది. 
 
ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేస్తున్నారు. ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజా వార్త ఏంటంటే... అన్న కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ఉన్న తర్వాత మళ్లీ ఎన్టీఆర్ మరో నిర్మాణ సంస్థను స్టార్ట్ చేస్తే బాగోదు అనిపించిందని.. అందుకని ఇక నుంచి అన్న కళ్యాణ్ రామ్‌తో కలిసి ఎన్టీఆర్ కూడా ఎన్టీఆర్ బ్యానర్ పైన సినిమాలు నిర్మించాలి అనుకుంటున్నారని తెలిసింది.

అందుకనే త్రివిక్రమ్‌తో చేస్తున్న సినిమా నిర్మాణంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌ని పార్టనర్‌గా చేసారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమానే కాకుండా ఇక నుంచి ఎన్టీఆర్ ఏ సినిమా చేసినా... ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ భాగస్వామిగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.