శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 నవంబరు 2023 (13:44 IST)

పెళ్లి కూతురు కాబోతున్న దండు పాళ్యం హీరోయిన్.. వరుడు?

Pooja Gandhi
Pooja Gandhi
ప్రముఖ కన్నడ నటి, దండు పాళ్యం మూవీ ఫేమ్‌ పూజా గాంధీ త్వరలో పెళ్లి కూతురు కానుంది. బుధవారం (నవంబర్‌ 29)న ఒక ప్రముఖ వ్యాపార వేత్తను పూజా వివాహం చేసుకోనుందని తెలుస్తోంది. ఇందుకోసం అన్నీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 
 
బెంగుళూరులోని యలహంకలో ఈమె వివాహం జరగబోతోందని టాక్. బెంగళూరులో లాజిస్టిక్స్ కంపెనీని కలిగి ఉన్న విజయ్‌ అనే వ్యక్తితో పూజా గాంధీ పెళ్లి జరుగనుందని తెలుస్తోంది. వీరిది ప్రేమ వివాహమని.. పెద్దల అంగీకారంతో బుధవారం జరుగబోతోంది. 
 
నటి పూజా గాంధీ స్వస్థలం ఉత్తరప్రదేశ్. ఆమె మాతృభాష హిందీ. కానీ కన్నడ చిత్ర పరిశ్రమలోనే స్థిరపడింది. పూజకు విజయ్‌నే కన్నడ నేర్పించాడట. ఆ తర్వాతనే ఆమె సినిమాల్లో నటించినట్లు తెలుస్తోంది.