మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 నవంబరు 2023 (12:56 IST)

వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి వేడుక: నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

VarunLav
టాలీవుడ్ జంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ పెళ్లి వేడుక నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. నవంబర్ 1న ఇటలీలోని టుస్కానీలో జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు హజరయ్యారు. 
 
రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నితిన్ వరుణ్, లావణ్య పెళ్లి వేడుకలలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 
 
వరుణ్ లావణ్యల పెళ్లికి సంబంధించిన వేడుకలను త్వరలో ప్రసారం చేయనుంది. ఇందుకోసం రూ.8 కోట్లతో మెగా ఫ్యామిలీతో ఓటీటీ దిగ్గజం డీల్ కుదుర్చుకుందని సమాచారం. దీని గురించి నెట్‌ ఫ్లిక్స్ కంపెనీ నుంచి కానీ లావణ్య, వరుణ్ నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.