శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 మార్చి 2023 (12:12 IST)

రిలయన్స్ జియో కొత్త ప్లాన్ - ఫ్యామిలీ మొత్తానికి ఉచిత ఫోన్ కాల్స్..

jiopuls plan
ప్రైవేట్ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో మరో కొత్త ప్లాన్‌ను అందుబాటులో తీసుకొచ్చింది. ఇది కుటుంబం మొత్తం వినియోగించుకోవచ్చు. అయితే, ఇది ప్రీపెయిడ్ ప్లాన్ మాత్రం కాదు. పోస్ట్ పెయిడ్ ప్లాన్. జియో ప్లస్ స్కీమ్ కింద దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
 
ఈ ప్లాన్‌లో భాగంగా, రూ.399 నెలవారీ పోస్ట్ పెయిడ్ ప్లాన్‌లో 75 జీవీ వరకు ఉచితంగా లభిస్తుంది. ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు పూర్తిగా ఉచితం. ఈ ప్లాన్ కావాలనుకునేవారు రూ.500 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. 
 
ఇకపోతే రూ.699 పోస్ట్ పెయిడ్ ప్లాన్ కింద 100 జీబీ డేటా ఉచితంగా ఇస్తుంది. ఫోన్స్, ఎస్ఎంఎస్‌లు ఉచితం. ఈ ప్లాన్ తీసుకునేవారు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లను ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ రెండు ప్లాన్లలోనూ ముగ్గురు సభ్యులను అదనంగా చేర్చుకోవచ్చు. అంటే మొత్తం నలుగురు సభ్యులు. 
 
అయితే, ఇక్కడో మెలిక వుంది. ఈ నాలుగు నంబర్లకు అంటే ప్రతి నెంబరకు నెలకు రూ.99 నెలవారీ చార్జ్ ఉంటుంది. ఈ ప్లాన్ సెక్యూరిటీ డిపాజిట్ రూ.875. నలుగురు సభ్యులు చేరినప్పటికీ ఉచిత బెనిఫిట్స్‌ను అందరూ వినియోగించుకోవచ్చు. 
 
ఇక రూ.299 వ్యక్తిగత పోస్ట్ పెయిడ్ ప్లాన్‌లో కాల్స్ ఉచితం. 30జీ బీడీ డేటా ఉచితం. ఎస్ఎంఎస్‌లు కూడా ఉచితమే. రూ.375 సెక్యూరిటీ డిపాజిట్ కింద చెల్లించాలి. అలాగే, రూ.599 ప్లాన్‌లో కాల్స్, ఎస్ఎంఎస్‌లతోపాటు డేటా కూడా పూర్తిగా ఉచితం. సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.750 కట్టాలి. ఈ ప్లాన్లలోనూ ఒక నెల ఉచిత ట్రయిల్ ఆఫర్ ఉంది. తీసుకుని, నచ్చకపోతే క్యాన్సిల్ చేసుకోవచ్చు.