శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: ఆదివారం, 26 ఫిబ్రవరి 2023 (22:23 IST)

భారతదేశంలో అలెక్సా ఐదవ వార్షికోత్సవాన్ని వేడుక చేసుకుంటున్న అమెజాన్

Alexa
భారతదేశవ్యాప్తంగా లక్షలాది మంది ఎకో డివైజస్‌ను కొనుగోలు చేస్తున్నట్లుగా భారతదేశంలో అమెజాన్ యొక్క అలెక్సా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అమెజాన్ వెల్లడించింది. వినియోగదారులు ఇంగ్లీష్‌, హిందీ, ఇంగ్లీష్‌ భాషలలో తమ అభ్యర్థనలను సంగీతం, కథలు, జోకులు, న్యూస్‌, సమాచారం, వంటకాలు, అలారం, రిమైడర్స్‌, స్మార్ట్‌ హోమ్‌ కంట్రోల్‌, బిల్‌ చెల్లింపులు... మరెన్నో వాటికి అభ్యర్థనలు చేస్తున్నారు. ఎకో స్మార్ట్‌ స్పీకర్లపై 2022లో అలెక్సా ద్వారా అమెజాన్ షాపింగ్‌ యాప్‌, ఫైర్ టీవీ మరియు ఇతర బ్రాండ్లలో అలెక్సా ఆధారిత ఉపకరణాల ద్వారా 2021తో పోలిస్తే అభ్యర్థనలు 37% పెరిగాయి. తద్వారా  దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిలోనూ ఇది మార్మోగుతుంది. అత్యధికంగా నూతన వినియోగదారులు తమ అలెక్సా ప్రయాణాన్ని అమేజాన్ షాపింగ్‌ యాప్‌ (ఆండ్రాయిడ్‌లో మాత్రమే) ప్రారంభిస్తున్నారు. ఇయర్‌ ఆన్‌ ఇయర్‌ నెలవారీ యాక్టివ్‌ వినియోగదారుల సంఖ్య 55%కు పైగా ఉంది.
 
అలెక్సా ఐదవ వార్షికోత్సవాన్ని వేడుక చేస్తూ అమేజాన్ ఇప్పుడు ఎకో స్మార్ట్‌ స్పీకర్లు, ఫైర్ టీవీ ఉపకరణాలు సహా అత్యుత్తమంగా విక్రయించబడుతున్న అలెక్సా ఉపకరణాలపై ఆఫర్లను వెల్లడించింది. ఇవి మార్చి 02 నుంచి మార్చి 04,2023 వరకూ లభ్యమవుతాయి. ఈ డీల్స్‌ గురించి మరింత సమాచారం అమేజాన్ వద్ద లభ్యమవుతుంది. ఈ విక్రయాలు మార్చి 02, 2023 వ తేదీ ఉదయం 12 గంటల నుంచి ప్రారంభమవుతాయి. అలెక్సా ఆధారిత ఉపకరణాలపై మరింతగా మీరు పొందడంతో పాటుగా మరెన్నో ఉత్సాహపూరితమైన అంశాలనూ కనుగొనవచ్చు. వినియోగదారులు స్మార్ట్‌ హోమ్‌ గాడ్జెట్స్‌ మరియు అలెక్సా బిల్ట్‌ ఇన్‌ ఉపకరణాలను బోట్‌, నాయిస్‌, ఫిలిఫ్స్‌, సిస్కా మరియు మరెన్నో బ్రాండ్ల నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు.
 
‘‘తమ రోజువారీ కార్యక్రమంలో భాగంగా అలెక్సాతో ఎంతోమంది భారతీయులు సంభాషిస్తుండటం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. భారతదేశం నుంచి, భారతదేశం కోసం అలెక్సాను నిర్మించాలన్నది మా లక్ష్యం మరియు మా ప్రయాణం దేశంలో యాంబియంట్‌ కంప్యూటింగ్‌ పరిణామానికి పర్యాయంగా నిలుస్తుందని నేను నమ్ముతున్నాను.  మేము మరింతగా ముందుకు వెళ్తే, వినోదాన్ని పొందడం, టాస్క్‌లను పూర్తి చేయడం మరియు సమాచారాన్ని యాక్సెస్‌ చేయడం కోసం  నూతన గొంతుకలు, స్పర్శ, కదలికలు మరియు లక్ష్య ఆధారిత అనుభవాలను తీసుకురావడంపై మా దృష్టి ఉంటుంది’’ అని  కంట్రీ మేనేజర్‌ అలెక్సా, అమెజాన్ ఇండియా దిలీప్‌ ఆర్‌ఎస్‌ అన్నారు.