శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (22:51 IST)

మహిళ ఎదగాలంటే.. మగాడి వెంట కాదు.. మనీ వెంట పడాలి.. ఉర్ఫీ జావేద్ (video)

Urfi Javed
Urfi Javed
నటి, మోడల్ ఉర్ఫీ జావేద్ తాజాగా బోల్డ్ కామెంట్స్ చేసింది. మహిళలు ఎదగాలంటే మగాడి వెంట కాకుండా డబ్బు వెంట పడాలని హితవు పలికింది. రెచ్చగొట్టే వస్త్రధారణలో కనిపించడంలో వున్న ఉద్దేశం.. అందరి కళ్లు తనపై వుండాలనే స్వార్థం అంతేనని తేల్చి పడేసింది. 
 
తన చిన్నప్పుడు తండ్రి వల్ల నరకం అనుభవించానని, బతకడానికే డబ్బులు సరిపోయేవి కావని గుర్తు చేసుకుంది. మోడ్రన్‌గా బతకాలని తనకున్న ఆశ కానీ తండ్రి ఒప్పుకునేవాడు కాదని గతాన్ని వివరించింది. తనకు ఫ్యాషన్ నాలెడ్జ్ లేకపోయినా ఎలాంటి దుస్తులు వేసుకోవాలో తెలుసన్నారు.
 
డర్టీ మ్యాగజైన్ కవర్ ఫోటో షూట్‌లో ఉన్నప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన శరీరాన్ని బెడ్ షీట్ వెనుక దాచుకోవడానికి ఇష్టపడనని అందరికీ చూపించడానికే ఇష్టమని తెలిపింది.