ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: శుక్రవారం, 8 మే 2020 (21:23 IST)

అప్పుడు చేసిన తప్పు ఇంకా నన్ను వేధిస్తోంది, పూజా హెగ్డే

పూజా హగ్డే నటించిన చిత్రాలు ఎన్నో హిట్టయ్యాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో ఎన్నో సినిమాలు కూడా ఉన్నాయి. లాక్ డౌన్ ఎత్తేస్తే సినిమాల్లో నటించడానికి ఎంతో ఆతృతగా ఉంది పూజా హెగ్డే. అయితే అభిమానులతో ఆమె కొన్ని విషయాలను పంచుకుంది. ప్రస్తుతం అవి చర్చకు దారితీస్తోంది.
 
మొదట్లో నా కెరీర్ ప్రారంభమైనప్పుడు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నా. కథలు పట్టించుకోలేదు. హీరో ఎవరో అడగను. కేవలం దర్సకుడు ఎవరన్నది మాత్రమే చూస్తూ సినిమాకు ఒప్పుకునే దాన్ని. అలా కాస్త ఇబ్బంది పడాల్సి వచ్చింది. కెరీర్ మొదట్లో ఎన్నో ఫెయిల్యూర్ లు మూటగట్టుకున్నాను.
 
అది తలుచుకుంటే చేసిన తప్పు ఇంకా వేధిస్తోంది. దర్సకుడి కన్నా కథ ముఖ్యమని ముందుగా అనుకుని ఆ తరువాత సినిమాకు ఓకే చేస్తే బాగుండేది..కానీ నేను అలా చేయలేకపోయాను. పూజా హెగ్డేకు విజయాలెన్నో అపజయాలు అన్ని అన్న టాక్ బాగానే తెలుగు సినీపరిశ్రమలో ఉంది. ఆ మాట నన్ను తీవ్రంగా బాధిస్తోంది. అందుకే ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నా..లాక్ డౌన్ తరువాత నటించే సినిమాలు మంచి కథాకథనం ఉన్నవి. అలాంటి సినిమాలకే ఒప్పుకుంటానంటోంది పూజా హెగ్డే.