గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: శనివారం, 2 మే 2020 (20:42 IST)

అనుష్క శర్మ అంతపని చేసిందా...?

సినిమాల్లో సాధారణంగా నటించే యువ హీరోహీరోయిన్లకు బ్యాక్‌గ్రౌండ్ ఖచ్చితంగా ఉండి తీరాలి. అలా ఉంటేనే వారు సినీపరిశ్రమలో ఎక్కువ రోజులు ఉండగలుగుతారు. సినిమాల్లో నటించగలుగుతారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎలాంటి రెకమెండేషన్ కుటుంబ నేపథ్యం లేకుండా ఉన్నవారు కొంతమంది ఉన్నారు.
 
అందులో అనుష్క శర్మ ఒకరు. ఆమె నటించిన సినిమాలు ఆమెకు ఎంతో మంచి పేరును తెచ్చిపెట్టాయి. అయితే నేను నటనలో రాణిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. చిన్నప్పటి నుంచి నా తండ్రి నాకు నేర్పించిన క్రమశిక్షణ.. ఎదుటి వారితో ఎలా మెలగాలో చెప్పిన తీరు నన్ను ఎంతగానో ఆలోచింపజేసింది. 
 
అందుకే అప్పటి నుంచి నేను అబ్బాయిలతో మాట్లాడటం పూర్తిగా మానేశాను. విద్యాభ్యాసం సమయంలో నాకు స్నేహితులందరు అమ్మాయిలే. అబ్బాయిలతో దూరంగా ఉండేదాన్ని. అందుకే నన్ను అందరూ ఆటపట్టించేవారు. నువ్వు ఎందుకు అబ్బాయిలకు దూరంగా ఉంటున్నావని అడిగేవారు. 
 
అయితే నేను నా స్నేహితులందరికీ ఒకటే చెప్పేదాన్ని. చేరాల్సిన గమ్యం, లక్ష్యం మన మనస్సులో పదిలంగా ఉండాలి. అలా ఉంటే దేన్నయినా సాధించగలం. మధ్యలో ఎన్నో రకాల ఇబ్బందులు వస్తుంటాయి. వాటిని అధిగమించాలి. అలాగని సమస్యలు మనమే కోరి తెచ్చుకోకూడదు కదా అందుకే అబ్బాయిల విషయంలో నేను కఠువుగా ఉన్నానని చెబుతోందట అనుష్క శర్మ. ప్రస్తుతం ఆమె హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా కూడా మంచి పేరు తెచ్చుకుంటోంది.