సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 26 మార్చి 2020 (11:12 IST)

పూజా హెగ్డే కోసం అఖిల్, ప్రభాస్ టెన్షన్.. ఎందుకు.. కెరీర్ సంగతేంటి? (video)

టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్ పేరు సంపాదించిన పూజా హెగ్డే ప్రస్తుతం రెమ్యూనరేషన్ విషయంలోనూ ముందుంది. అరవింద సమేత, మహర్షి, గద్దల కొండ గణేష్ వంటి సినిమాల్లో నటనపరంగానూ, గ్లామర్ పరంగానూ అదరగొట్టింది. దీంతో ఆమెకు డిమాండ్ బాగా పెరిగింది. దీంతో స్టార్ హీరోలంతా పూజా వైపే చూస్తున్నారు.
 
దీంతో పూజా రెమ్యూనరేషన్ రెట్టింపు చేసినట్టు తెలుస్తోంది. సుమారు రూ.2 కోట్ల వరకు డిమాండ్ చేస్తోందట. అల వైకుంఠపురంలో పూజా హెగ్డే ఖాతాలో మరో హిట్ సంపాదించి పెట్టడంతో.. మొత్తానికి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఫార్ములాను పూజా పక్కాగా ఫాలో అవుతోందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. 
 
ఇకపోతే ప్రస్తుతం ఆమె చేతిలో ప్రభాస్ చేస్తున్న జాన్, అఖిల్-బొమ్మరిల్లు భాస్కర్ చిత్రాలున్నాయి. ఇవి గనుక హిట్టైతే రూ.2 కోట్లు కాస్త రూ.3 కోట్లకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని సినీ పండితులు చెప్తున్నారు. అయితే పూజా హెగ్డే కెరీర్‌కు కరోనాతో దెబ్బ తగిలింది. కరోనా కారణంగా సినిమా షూటింగ్స్ ఎక్కడికక్కడికి ఆగిపోయాయి.
 
ఏప్రిల్ 1 తర్వాత మళ్లీ యధావిధిగా షూటింగ్స్ ఆరంభం అవుతాయని అంతా భావించినా కూడా పరిస్థితులు అలా కనిపించడం లేదు. దేశ వ్యాప్తంగా లాకౌట్ ప్రకటించిన నేపథ్యంలో ఏప్రిల్ నెల చివరి వరకు కూడా షూటింగ్స్ జరిగే పరిస్థితి లేదని టాక్ వినిపిస్తుంది. ఈ సమయంలో హీరోల హీరోయిన్స్ డేట్లు అంతా కూడా గందరగోళంగా మారుతున్నాయి. 
 
ప్రస్తుతం ప్రభాస్ ఇంకా అఖిల్‌లు పూజా హెగ్డే విషయంలో టెన్షన్ పడుతున్నారు. అఖిల్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. వారం పది రోజులు పూజా హెగ్డే షూటింగ్‌లో పాల్గొంటే పూర్తి అవ్వనుంది. ఇక ప్రభాస్ ఓ డియర్ షూటింగ్‌లో కూడా పూజా హెగ్డే పాల్గొనాల్సి ఉంది.
 
ఓ డియర్ కోసం జార్జియా వెళ్లిన యూనిట్ సభ్యులు కరోనా కారణంగా వారం రోజుల్లోనే తిరిగి వచ్చారు. పూజా హెగ్డే తోనే కీలక సన్నివేశాలు చిత్రీకరణ చేయాల్సి ఉంది. కనుక మళ్లీ ఆమె డేట్లు అవసరం కానున్నాయి.
 
మరోవైపు పూజా హెగ్డే హిందీలో సల్మాన్‌కు కూడా జోడీగా నటించేందుకు ఒప్పుకుంది. ఆ సినిమాకు డేట్లు ఇవ్వాల్సి ఉంది. సల్మాన్‌కు డేట్లు ఇస్తే ఈ రెండు సినిమాలకు ఆమె డేట్లు కేటాయించడం కష్టంగా మారే అవకాశం ఉందని.. దాంతో రెండు సినిమాలు విడుదలలో జాప్యం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
 
ఇదిలా ఉంటే.. పూజా హెగ్డే ఇటీవల ప్రభాస్ చిత్రం కోసం జార్జియా వెళ్లి వచ్చింది. అప్పటి నుండి ముంబయిలోని తన ఇంట్లోనే పూర్తిగా ఉంటోంది. స్వీయ నిర్భందంలో ఆమె ఉంటున్నట్లుగా ప్రకటించింది. ఈ సమయంలో ఆమె తన ఆహారపు అలవాట్లను పూర్తిగా పక్కకు పెట్టేసిందట. డైట్‌ను ఇంతకు ముందు ఫాలో అయ్యేదాన్ని. కాని ఇంట్లో ఉంటున్న కారణంగా డైట్‌ను పూర్తిగా పక్కకు పెట్టేసినట్లుగా చెప్పుకొచ్చింది. తిండి విషయంలో అదుపులో ఉండలేక పోతున్నట్లుగా సరదాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పోస్టు కాస్త వైరల్ అవుతోంది.