శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 మార్చి 2020 (16:32 IST)

గ్రెటా థన్‌బర్గ్ కరోనా వైరస్ బారిన పడిందా?

పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ కరోనా వైరస్ బారిన పడిందా? అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు ఆమే పోస్టు వైరల్ అవుతోంది. తాను వైరస్ బారిన పడినట్లు అనుమానం ఉందని గ్రెటా అంటోంది. ఈ మేరకు ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. తనూ తండ్రి ఇద్దరూ కరోనా బారిన పడిఉండొచ్చని, ఆ అవకాశం చాలా ఎక్కువగా ఉందని తెలిపింది.
 
కరోనా లక్షణాల్లో భాగంగా పది రోజుల క్రితం తనలో కనిపించాయని గ్రెటా వెల్లడించింది. తొలుత బాగా అలసటగా ఫీలయ్యానని, తర్వాత వణుకు మొదలైందని చెప్పుకొచ్చింది. తర్వాత గొంతులో ఇబ్బంది, దగ్గు ప్రారంభమయ్యాయని గ్రెటా తెలిపింది. తనలో రోగలక్షణాలు అంత తీవ్రంగా లేవని, తన తండ్రికి మాత్రం ఇబ్బంది ఎక్కువగానే ఉందని తెలిపింది. ఇంటికే పరిమితమవుతూ కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలని ఈ సందర్భంగా గ్రెటా పిలుపునిచ్చింది.