కర్నాటకలో బీజేపీ ఎంపీ కుమార్తెకు కరోనా పాజిటివ్

coronawoman
ఠాగూర్| Last Updated: బుధవారం, 25 మార్చి 2020 (14:36 IST)
రాష్ట్రంలో అధికార బీజేపీ ఎంపీ కుమార్తెకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమెను ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె పేరు అశ్విని. కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ జీఎం సిద్ధేశ్వర కుమార్తె. ఈమె మార్చి 20వ తేదీ గయానా నుంచి న్యూయార్క్, ఢిల్లీ మీదుగా బెంగుళూరుకు చేరుకున్నారు.

స్వదేశానికి వచ్చిన ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా, ఇందులో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమెను ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఈమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరికి కూడా కరోనా పరీక్షలు చేశారు. అయితే, ఈ ఫలితాలు రావాల్సివుంది. ఎంపీ సిద్దేశ్వ‌ర‌కు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా కరోనా నెగిటివ్ వ‌చ్చింది. దీంతో ఆయన ఊపిరి పీల్చుకున్నారు.దీనిపై మరింత చదవండి :