1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Pooja Hegde Marriage with Star hero son

బుట్టబొమ్మకు పెళ్లి.. స్టార్ హీరో కుమారుడితో ఫిక్స్.. డిసెంబరులో..?

Pooja Hegde
బుట్టబొమ్మకు త్వరలో పెళ్లి కానుందనే వార్త బిటౌన్‌లో వైరల్ అవుతోంది. బిటౌన్‌కు చెందిన స్టార్ హీరో కుమారుడిని పూజా హెగ్డే మనువాడనుందని టాక్ వస్తోంది. వీరి వివాహానికి సన్నిహితులు మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది. 
 
వచ్చే ఏడాది మార్చి చివరలో వివాహం జరిగే అవకాశం ఉంది. డిసెంబరులో నిశ్చితార్థం వుంటుందని టాక్. బుట్టబొమ్మను మనువాడబోయే స్టార్ హీరో కొడుకు ఎవరా? అంటూ సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ మొదలైంది. 
 
స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డే ఖాతాలో ప్రస్తుతం హిట్స్ లేవు. గుంటూరు కారం సినిమాలో ఒక హీరోయిన్‌గా ఎంపికైనప్పటికీ కాల్షీట్లు అడ్జస్ట్ కాక తప్పుకుంది. దీంతో ఆమె స్థానంలో శ్రీలీల ప్రధాన హీరోయిన్‌గా మారింది. మీనాక్షి చౌదరి మరో హీరోయిన్‌గా ఎంపికైంది.
తర్వాతి కథనం
కంగువలో ఐదు గెటప్స్‌లో సూర్య.. 2024 సమ్మర్‌ స్పెషల్‌గా రిలీజ్