మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 నవంబరు 2023 (10:12 IST)

ప్రియుడితో అమలా పాల్ కొత్త జీవితం.. సింపుల్‌గా రెండో పెళ్లి

amala paul
హీరోయిన్ అమలాపాల్ మరో పెళ్లి చేసుకున్నారు. తన ప్రియుడు జగత్ దేశాయ్‌ను ఆమెను వివాహం చేసుకున్నారు. ఆదివారం కొచ్చిన్‌లోని ఓ నక్షత్ర హోటల్‌లో ఈ వివాహం జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులు, అతి కొద్దిమంది స్నేహితులు మాత్రమే హాజరుకాగా, చాలా సింపుల్‌గా పూర్తి చేశారు.
amala paul
 
టారిజం - హాస్పిటాలిటీ రంగ నిపుణుల జగత్ దేశాయ్‌తో అమలాపాల్ గత కొన్ని రోజులుగా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెల్సిందే. ఈ క్రమంలో వారిద్దరూ ఆదివారం మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
amala paul
 
నిజానికి అమలా పాల్‌కు గతంలో ఓ సారి వివాహమైంది. కోలీవుడ్ దర్శకుడు ఏఎల్ విజయ్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ ప్రేమించుకున్నప్పటికీ ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి జరిగింది. అయితే, ఈ వివాహ బంధం ఎక్కువ రోజులు కొనసాగలేదు.
amala paul
 
ఆ తర్వాత అమలా పాల్.. జగత్ దేశాయ్‌కి చాలా దగ్గరైంది. ఇటీవల అమలా పాల్ పుట్టిన రోజు సందర్భంగా జగత్ తన ప్రేమను వ్యక్తం చేయగా, ఇంతలోనే వారిద్దరు పెళ్లి చేసుకోవడం గమనార్హం. వివాహానికి ముందు దిగిన ఫోటోలను జగత్ దేశాయ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
amala paul