గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 అక్టోబరు 2023 (15:55 IST)

అమలా పాల్ రెండో పెళ్లి.. ఇన్‌స్టాలో బాయ్‌ఫ్రెండ్ ఫోటోలు వైరల్

Amala Paul
Amala Paul
తెలుగు, తమిళం, మలయాళ సినిమాల్లో పనిచేస్తున్న నటి అమలా పాల్ రెండో పెళ్లికి సిద్ధం అయ్యింది. తాజాగా ఆమె తన ప్రియుడి చిత్రాలను పంచుకుంది. జగత్ దేశాయ్‌తో తన ఫోటోలను  ఇన్‌స్టాలో షేర్ చేసింది.  
 
తాజాగా వీరిద్దరి నిశ్చితార్థం గోవాలో జరిగింది. అంతకుముందు, జగత్ దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో  వీడియోను పంచుకున్నారు. ఈ జంట తమ సెలవుల్లో ఏదో రెస్టారెంట్‌లో ఫ్లాష్ మాబ్ డ్యాన్స్ ప్రదర్శనను ఆస్వాదిస్తున్నట్లు చూపిస్తుంది. 
 
ఇకపోతే... అమలాపాల్ ప్రముఖ దర్శకుడు విజయ్‌ని జూన్ 12, 2014న చెన్నైలో వివాహం చేసుకున్నారు. 2016లో, అమల- విజయ్ విభేదాల కారణంగా విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారు 2017లో విడాకులు తీసుకున్నారు.