1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 నవంబరు 2023 (20:02 IST)

కంగువలో ఐదు గెటప్స్‌లో సూర్య.. 2024 సమ్మర్‌ స్పెషల్‌గా రిలీజ్

Suriya kanguva
సింగం ఫేమ్ సూర్య నటిస్తున్న కొత్త సినిమా కంగువ. సూర్యకు ఇది 42వ సినిమా. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇంకా దీపావళికి ఈ సినిమా నుంచి గ్లింమ్స్ విడుదలైంది. 
 
ఇందులో సూర్య గెటప్ విభిన్నంగా వుంది. ఈ మూవీలో సూర్య ఒక క్రూర రాజు పాత్రలో కనిపిస్తాడని టాక్. ఈ సినిమా కంగువ టైటిల్‌తో తెరపైకి రానుంది. సూర్య ఈ సినిమాలో ఏకంగా ఐదు గెటప్స్‌లో కనిపిస్తారని తెలుస్తోంది. 2024 సమ్మర్‌ స్పెషల్‌గా కంగువ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.