మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By dv
Last Updated : శుక్రవారం, 21 అక్టోబరు 2016 (19:04 IST)

వెండితెరపై కనిపించనున్న రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య

తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ పెద్ద కుమార్తె ఐశ్వర్య ధనుష్‌ మొదటి నుంచి కూడా దర్శకత్వంపై దృష్టిపెడుతూ వచ్చింది. అలా ఆమె 'త్రీ'.. 'వెయ్‌ రాజా వెయ్‌' సినిమాలకి దర్శకత్వం వహించింది. రజినీకాంత్‌ జీవితచరిత

తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ పెద్ద కుమార్తె ఐశ్వర్య ధనుష్‌ మొదటి నుంచి కూడా దర్శకత్వంపై దృష్టిపెడుతూ వచ్చింది. అలా ఆమె 'త్రీ'.. 'వెయ్‌ రాజా వెయ్‌' సినిమాలకి దర్శకత్వం వహించింది. రజినీకాంత్‌ జీవితచరిత్ర ఆధారంగా 'వీరన్‌' అనే టైటిల్‌‌తో ఒక డాక్యుమెంటరీ చేసే పనిలో వుంది. 
 
అలాంటి ఐశ్వర్య ధనుష్‌ .. త్వరలో వెండితెరపై కనిపించబోతోంది. ధనుష్‌ నిర్మాతగా రజినీకాంత్‌ కథానాయకుడిగా రంజిత్‌ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో ఐశ్వర్య ధనుష్‌ కనిపించనుందని చెన్నై మీడియా తెలియజేస్తుంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనుంది.