శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 5 ఏప్రియల్ 2017 (03:36 IST)

కోలివుడ్‌పై టాలివుడ్ దాడి.. పోయిన చోటే వెతుక్కుంటానన్న పంజాబీ సుందరి

ఈరోజు రకుల్ ప్రీత్ సింగ్ అంటే తెలుగు సినిమాలు చూసే బుడ్డోడికి కూడా తెలుసు. ఆ రేంజిలో అందరి అవకాశాలను కొల్లగొట్టేసింది. అతి తక్కువకాలంలోనే టాలివుడ్‌లో కుర్రకారు హీరోల సినిమాల్లో ముఖ్యంగా మెగా ఫ్యామిలీ మెంబర్‌ రేంజిలో దున్నేసిన రకుల్ సంవత్సరాలుగా సినిమ

ఈరోజు రకుల్ ప్రీత్ సింగ్ అంటే తెలుగు సినిమాలు చూసే బుడ్డోడికి కూడా తెలుసు. ఆ రేంజిలో అందరి అవకాశాలను కొల్లగొట్టేసింది. అతి తక్కువకాలంలోనే టాలివుడ్‌లో కుర్రకారు హీరోల సినిమాల్లో ముఖ్యంగా మెగా ఫ్యామిలీ మెంబర్‌ రేంజిలో దున్నేసిన రకుల్ సంవత్సరాలుగా సినిమాలకు దూరమై ఈ మధ్యే ఎంట్రీ ఇచ్చి బంపర్ హిట్ కొట్టిన చిరంజీవిని సైతం మెప్పించిన అందం, నటనా ప్రతిభ రకుల్ సొంతం.
 
కానీ ఆమె మొదట తమిళ చిత్రసీమలో అడుగుపెట్టి వరుసగా ప్లాఫ్ సినిమాలు చేసి అక్కడ ఐరన్ లెగ్ నటిగా ముద్రపడి బయటకు వచ్చేసింది. కానీ టాలీవుడ్ మాత్రం ఆమెను ఒక్కరాత్రిలో సూపర్ హీరోయిన్‌గా వచ్చేసింది. టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా విజృంభిస్తున్న రకుల్‌కు కొలీవుడ్ మల్లీ ఎర్రతివాచీ పరుస్తోంది. ఇప్పటికే కార్తీకి జంటగా ధీరన్‌ అధ్యాయం ఒండ్రు చిత్రంలో నటిస్తున్న రకుల్‌ప్రీత్‌సింగ్‌ విజయ్‌తో డ్యూయెట్లు పాడే అదృష్టం లభించనున్నట్లు టాక్‌. 
 
ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్న తెలుగు చిత్రంలో కథానాయకి రకుల్‌ప్రీత్‌సింగ్‌ అన్నది గమనార్హం. అలా విజయ్‌కు జంటగా నటించే అవకాశాన్ని ఈ దర్శకుడే కల్పించనున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ఇంతకు ముందు తుపాకి, కత్తి చిత్రాలను తెరకెక్కించిన ఏ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో ముచ్చటగా మూడోసారి నటించడానికి విజయ్‌ రెడీ అవుతున్నారు. ఈ చిత్రం ఆగస్ట్‌లో ప్రారంభం కానున్నట్లు తాజా సమాచారం. 
 
కాజల్‌అగర్వాల్, సమంత, నిత్యామీనన్‌.. ఈ ముగ్గురు హీరోయన్లు ఇప్పుడు విజయ్‌ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రకుల్ కూడా విజయ్ మరో సినిమాలో అవకాశం దక్కించుకున్నట్లు వార్తలు వస్తుండటంతో టాలివుడ్ హీరోయిన్లు మొత్తంగా కొలివుడ్ పై దాడి చేస్తున్నట్లు భావిస్తున్నారు.