బుధవారం, 5 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By dv
Last Updated : శుక్రవారం, 6 మే 2016 (21:17 IST)

రాంచరణ్‌ కొత్త చిత్రం 'ఛోటామేస్త్రి' కాదంటున్న దర్శకుడు!

'ముఠామేస్త్రీ', 'మాస్టర్‌' వంటి పేర్లతో చిరంజీవి సినిమాలు తీస్తే.. 'ఛోటామేస్త్రి' పేరుతో రామ్‌చరణ్‌ను చూపించాలని దర్శకుడు సంపత్‌నంది భావించాడు. తనతో ముందుగా 'రచ్చ' తీశాడు. మళ్ళీ మంచికథతో వస్తానని చెప్పడంతో రామ్‌చరణ్ ఆఫర్‌ ఇచ్చారు కూడా. అయితే పవన్‌ కళ్యాణ్‌ ఇచ్చిన షాక్‌తో సంపత్‌ ఏదో సినిమా తీసే పనిలోవున్నాడు. 
 
ఎందుకంటే 'గబ్బర్‌ సింగ్‌' సీక్వెల్‌కు దర్శకుడిగా ముందుగా సంపత్‌నే అనుకున్నారు. ఆ కసితో రవితేజతో వెంటనే 'బెంగాల్‌ టైగర్‌' చేసి హిట్‌ కొట్టాడు. అయితే ఈ చిత్రం విడుదలై దాదాపు ఐదు ఆరు నెలలు కావస్తున్న ఇంకా తన తదుపరి చిత్రం మొదలు పెట్టలేదు. 
 
తర్వాత రాంచరణ్‌తో 'ఛోటామేస్త్రి' మొదలు పెడుదాం అనుకున్న సంపత్‌‌కు చెర్రి నుంచి స్పందన లేకపోవడంతో నితిన్‌‌తో తన తదుపరి ప్రాజెక్ట్‌ చేయడానికి రెఢీ అయ్యాడని తెలిసింది. అయితే నితిన్‌ 'గుండె జారి గల్లంతయ్యిందే' చిత్రంతో కెరియర్‌ బిగ్గెస్ట్‌ హిట్‌ అందించిన విజయ్‌ కుమార్‌ కొండ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెఢీ అవుతుండటం గమనార్హం. ఈ చిత్రం ఈ ఏడాది చివరకల్లా పూర్తి కానుంది. ఆ తర్వాతే నితిన్‌తో ఉంటుందట.