విజయ్ పింక్ టోపీని ధరించిన రష్మిక మందన్న.. ప్రేమ నిజమేనా?
టాలీవుడ్ స్టార్స్ రష్మిక మందన్న-విజయ్ దేవరకొండ ప్రేమలో వున్నట్లు మీడియాలో వార్తలు వస్తూనే వున్నాయి. అయితే తాము స్నేహితులమని వీరు చెప్పుకొస్తున్నారు. ఇంకా వారి వారి కెరీర్‌పై దృష్టి పెడుతున్నారు. పుష్పతో హిట్ కొట్టిన రష్మిక ప్రస్తుతం పుష్ప-2పై షూటింగ్‌లో బిజీ బిజీగా వుంది.
ఇటీవల, మహిళా దినోత్సవం సందర్భంగా రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫోటో షేర్ చేసింది. ఈ ఫోటోలో నీలి రంగు స్వెటర్- నలుపు పైజామా ధరించి కనిపించింది. అయితే, అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రాన్ని షేర్ చేసిన వెంటనే, రష్మిక విజయ్ దేవరకొండ పింక్ ఉన్ని టోపీని ధరించడం అభిమానులు గుర్తించారు.
డిసెంబర్ 2023లో, విజయ్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఇదే పింక్ క్యాప్‌లో న్యూయార్క్ వీధుల్లో తిరుగుతూ కనిపించాడు. ప్రస్తుతం రష్మిక కూడా అదే క్యాప్‌ను ధరించింది. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు.