నార‌ప్ప భార్య‌కు మ‌ళ్ళీ వివాహ క‌ష్టాలు

priyamani-mustafa
డీవీ| Last Updated: గురువారం, 22 జులై 2021 (17:28 IST)
priyamani-mustafa
ఇటీవ‌లే వెంక‌టేష్ కు భార్య‌గా న‌టించిన `నార‌ప్ప‌`లో ప్రియ‌మ‌ణి కావాల‌ని పెండ్లిచేసుకుంటుంది. నిజ జీవితంలోనూ అలానే వివాహం చేసుకున్నా ప్ర‌స్తుతం అది చిక్కుగా మారింది. 2007లో ప్రియమణి, ముస్తఫాల వివాహం జరిగింది. నాలుగేళ్ళు హాయిగా కాపురం చేసుకుంటున్న వారి వైవాహిక జీవితంలోకి ముస్త‌ఫా మొద‌టి భార్య అయేషా ప్ర‌వేశించింది. తన భర్త ముస్తఫా రాజ్ వివాహం చెల్లదని అయేషా ప్రకటించింది. చ‌ట్ట ప్ర‌కారం మొదటి భార్యతో సెపరేట్ అయినప్పటికీ ఇంకా విడాకులు తీసుకోలేదు కాబట్టి ప్రియమణితో అతని వివాహం చట్టవిరుద్ధం. అదేవిధంగా ముస్తఫా రాజ్ పై గృహ హింస కేసును కూడా అయేషా పెట్టింది. ఇప్ప‌టికే అయేషా, ముస్తఫా కు ఇద్దరు పిల్లలు.

మేజిస్ట్రేట్ కోర్టులో ఈ వివాదానికి సంబంధించిన కేసులు ఉన్నాయి. చ‌ట్ట‌ప్ర‌కారం ఎలాంటి తీర్పు ఇస్తారో ఇవ్వ‌మ‌ని కోర్టును అయేషా అభ్య‌ర్థిస్తోంది. మ‌రి ప్రియ‌మ‌ణి కాపురం ఏమ‌వుతుందో చూడాలి. ఇప్ప‌టికే టీవీ షోల‌లోనూ, సినిమాల‌లోనూ బిజీగా వున్న ప్రియ‌మ‌ణి రియ‌ల్ లైఫ్‌లో క‌ష్టాలు ఎదుర్కొంటుంది.దీనిపై మరింత చదవండి :