శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 16 డిశెంబరు 2016 (13:46 IST)

డిసెంబర్ 31 అర్థరాత్రి గానాబజానాకు రూ.4 కోట్లు డిమాండ్ చేసిన సన్నీ!

మరో 14 రోజుల్లో 2016 సంవత్సరం ముగియనుంది. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచే అమితాసక్తిని చూపుతున్నారు. ముఖ్యంగా పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, నూతన సంవత్సరానికి ఆనందంగా

మరో 14 రోజుల్లో 2016 సంవత్సరం ముగియనుంది. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచే అమితాసక్తిని చూపుతున్నారు. ముఖ్యంగా పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, నూతన సంవత్సరానికి ఆనందంగా స్వాగతం పలకడానికి నక్షత్ర హోటళ్లు ఇప్పటినుంచే పలు రకాలైన ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇందులోభాగంగా సినీ నటులతో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నాయి. 
 
దీనిని క్యాష్ చేసుకునేందుకు దేశవ్యాప్తంగా ఉన్న సినీ పరిశ్రమల్లోని నటుల మేనేజర్లు రేట్లు ఫిక్స్ చేసి, సంప్రదింపులు జరుపుతుంటారు. ఈ యేడాది కూడా ఓ స్టార్ హోటల్ డిసెంబర్ 31 అర్థరాత్రి గానాబజానాకు ఏర్పాట్లు చేసుకుంది. అందులో భాగంగా పోర్న్ స్టార్ సన్నీలియోన్‌ను సంప్రదించింది. 
 
దానికి వెంటనే సన్నీ అంగీకరించింది. తాజాగా విడుదలైన 'రయీస్' సినిమాలోని 'లైలా ఓ లైలా' పాటకు స్టెప్పులు వేయాలని కోరిందని తెలుస్తోంది. ఇందుకు గాను ఆమెకు 4 కోట్ల రూపాయలు చెల్లించనున్నట్టు బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. 
 
నిజానికి షారూక్ ఖాన్ నటించిన ఈ చిత్రంలో ఐటమ్‌ సాంగ్‌లో నటించినందుకు ఆమెకు అంత మొత్తంలో రెమ్యునరేషన్ కూడా ముట్టలేదు. కానీ, ఒక్కరాత్రి న్యూఇయర్ బాష్ కోసం ఆమె ఏకంగా రూ.4 కోట్లను డిమాండ్ చేయడం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.