మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : బుధవారం, 4 అక్టోబరు 2017 (12:16 IST)

సమంత - చైతూ పెళ్లి బడ్జెట్ ఎంతంటే?

టాలీవుడ్ హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంతలు ఓ ఇంటివారు కాబోతున్నారు. ఈనెల 6, 7 తేదీల్లో గోవాలో వీరిద్దరి వివాహం హిందూ, క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం జరుగనుంది. ఇందుకోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.

టాలీవుడ్ హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంతలు ఓ ఇంటివారు కాబోతున్నారు. ఈనెల 6, 7 తేదీల్లో గోవాలో వీరిద్దరి వివాహం హిందూ, క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం జరుగనుంది. ఇందుకోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.
 
అయితే, వీరిద్దరి పెళ్లి వేడుకక కోసం హీరో నాగార్జున పది కోట్ల రూపాయలను కేటాయించినట్టు సమాచారం. పైగా, పెళ్లి వేడుకలకు అయ్యే ఖర్చు మొత్తాన్ని చైతూ - సామ్‌లే ఇవ్వనున్నారట. గోవాలో అక్టోబర్ 6న, 7న రెండు సాంప్రదాయక పద్దతుల్లో గ్రాండ్‌గా జరుగనున్న వెడ్డింగ్ ఈవెంట్‌కు కేవలం 100 మంది అతిథులు మాత్రమే హాజరుకానున్నారట.
 
తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి నుంచి హీరో రాంచరణ్, ఉపాసన దంపతులు, రానా దగ్గుబాటి, వెంకటేశ్, చిన్మయి దంపతులతో పాటు చైతూ, సమంత క్లోజ్ ఫ్రెండ్స్, ఇరు కుటుంబాలకు చెందిన సభ్యులు మాత్రమే హాజరుకానున్నారట.
 
ఇదిలావుంటే పెళ్లి ఘడియలు దగ్గర పడుతుండడంతో వివాహ ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. సమంత, చైతూలు కుటుంబ సభ్యులతో కలిసి ఆనంద క్షణాలు గడుపుతున్నారు. తాజాగా సమంత, చైతూ కలిసి ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బ్రైడ్ విషెస్ అని రాసి ఉన్న టీ షర్ట్ ధరించిన సమంత, చైతూతో కలిసి ఫోటోకి ఫోజులిచ్చింది.
 
ఇందులో ఇద్దరు చాలా హ్యపీగా కనిపిస్తున్నారు. 6న హిందూ సంప్రదాయ పద్ధతిలో జరగనున్న వీరి వివాహం 7న సమంత కుటుంబం ఆచరించే క్రైస్తవ సంప్రదాయ పద్ధతిలో జరగనుంది. ఈనెల 15వ తేదీన హైదరాబాద్‌లో రిసెప్షన్‌ని గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. స్టైలిష్ డిజైనర్ క్రేషా బజాజ్ డిజైన్ చేసిన దుస్తులనే సమంత ధరించనుందని సమాచారం.