బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 3 అక్టోబరు 2017 (19:01 IST)

రెండు రోజుల్లో చైతు-సమంతల పెళ్లి... 100 మంది వస్తారు... నాగార్జున ప్రకటన

మరో రెండు రోజుల్లో నాగ చైత‌న్య‌, స‌మంతల వివాహం జరుగుతుందని అక్కినేని నాగార్జున మంగళవారం సాయంత్రం మీడియాకు తెలియజేశారు. పెళ్లికి పెద్దగా హంగూ-ఆర్భాటాలు లేకుండా చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే పెళ్లి చేసుకోవాలన్న ఆకాంక్షను నాగచైతన్య తనను అడిగాడనీ, వా

మరో రెండు రోజుల్లో నాగ చైత‌న్య‌, స‌మంతల వివాహం జరుగుతుందని అక్కినేని నాగార్జున మంగళవారం సాయంత్రం మీడియాకు తెలియజేశారు. పెళ్లికి పెద్దగా హంగూ-ఆర్భాటాలు లేకుండా చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే పెళ్లి చేసుకోవాలన్న ఆకాంక్షను నాగచైతన్య తనను అడిగాడనీ, వారు కోరుకున్నట్లుగానే ఎలాంటి ఆర్భాటాలకు పోకుండా చాలా సామాన్యంగా వారి పెళ్లి జరుపుతున్నట్లు చెప్పారు.
 
ఈ పెళ్లికి కేవలం 100 మంది మాత్రమే హాజరవుతారనీ, ఎక్కువమందిని పిలువకపోయినప్పటికీ అంతా నూతన వధూవరులకు ఆశీర్వాదాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. సమంత-నాగచైతన్యల వివాహం క్రిస్టియ‌న్, హిందూ సంప్ర‌దాయాల ప్ర‌కారం జరిపిస్తున్నట్లు వెల్లడించారు. కాగా ఈ పెళ్లి గోవాలో జరగనుంది.