శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : బుధవారం, 19 ఏప్రియల్ 2017 (14:58 IST)

చైతూ - సమంత పెళ్లి ఫిక్స్... మామ నాగార్జునతో అది పూర్తికాగానే వివాహం

టాలీవుడ్ ప్రేమజంట హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంతల పెళ్లి ఫిక్స్ అయింది. అక్టోబరు నెలలో వీరిద్దరు ఓ ఇంటివారు కాబోతున్నారు. ఇప్పటికే నిశ్చితార్థం పూర్తి చేసుకున్న ఈ జంట వివాహం ఆగస్టులో ఉంటుందని ముందుగా

టాలీవుడ్ ప్రేమజంట హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంతల పెళ్లి ఫిక్స్ అయింది. అక్టోబరు నెలలో వీరిద్దరు ఓ ఇంటివారు కాబోతున్నారు. ఇప్పటికే నిశ్చితార్థం పూర్తి చేసుకున్న ఈ జంట వివాహం ఆగస్టులో ఉంటుందని ముందుగా ప్రచారం జరిగింది. అయితే, ఈ వివారం అక్టోబరు నెలలో ఉంటుందని ఫిల్మ్ నగర్ వర్గాల తాజా సమచారం.
 
నిజానికి వీరిద్దరు వరుస సినిమాల్లో బిజీగా ఉన్నారు. దీంతో పెళ్లి ఇప్పట్లో లేనట్టే భావించారు. ఈ నేపథ్యంలో సడెన్‌గా పెళ్లి డేట్‌ని చెప్పేసిందీ జంట. వీరి వివాహం హిందూ, క్రైస్తవ సంప్రదాయం మేరకు జరుగనుంది. ముందుగా అనుకున్నట్టు కాకుండా, అక్టోబరు పెళ్లిపీటలు ఎక్కనుందీ జంట. ఆలోపు ఇప్పటికే కమిట్‌మెంట్ ఇచ్చిన సినిమాలని పూర్తి చేయనున్నారు.
 
కాగా, ఇటీవలే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాని పూర్తి చేశాడు చైతూ. ప్రస్తుతం కృష్ణ మరిముత్తు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే, సమంత కూడా తనకు కాబోయే మామ, హీరో నాగార్జున నటించే 'రాజుగారి గది 2' సీక్వెల్, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చరణ్ సినిమాల్లో నటిస్తోంది. ఈ చిత్రాలను పూర్తి చేసి పెళ్లిపీటలనెక్కనుంది.