శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : ఆదివారం, 30 జులై 2017 (11:52 IST)

'బిగ్‌బాస్' నుంచి సంపూ వైదొలగడానికి కారణమిదే...

ప్రముఖ టీవీ 'స్టార్ మా'లో ప్రసారమయ్యే బిగ్‌బాస్ షో నుంచి టాలీవుడ్ హీరో సంపూర్ణేష్ బాబు అర్థాంతరంగా వైదొలిగాడు. ఇలా షో నుంచి బయటకురావడానికి అసలైన కారణాలు ఇపుడు వెలుగులోకి వచ్చాయి.

ప్రముఖ టీవీ 'స్టార్ మా'లో ప్రసారమయ్యే బిగ్‌బాస్ షో నుంచి టాలీవుడ్ హీరో సంపూర్ణేష్ బాబు అర్థాంతరంగా వైదొలిగాడు. ఇలా షో నుంచి బయటకురావడానికి అసలైన కారణాలు ఇపుడు వెలుగులోకి వచ్చాయి. 
 
నిజానికి ఈ షో కంటెస్టెంట్స్‌‌లో ఒకరైన సంపూర్ణేష్ బాబు నాలుగు గోడల మధ్య ఉండలేక, ఆ వాతావరణంలో ఇమడలేకే బయటికొచ్చినట్లు ప్రకటించారు. అయితే సంపూ ఈ షో నుంచి బయటకు రావడానికి అదొక్కటే కారణం కాదట. మిగతా కంటెస్టెంట్స్‌లో కొందరు సంపూతో హేళనగా మాట్లాడటం, అవమానించడం జరిగిందట.
 
సంపూ చేసిన సినిమాల్లో కామెడీ సీన్స్‌ను ప్రస్తావిస్తూ ఎగతాళి చేసేవారట. పైగా నీలాంటి కమెడియన్‌కు కూడా వరుస సినిమాలు రావడం ఆశ్చర్యంగా ఉందంటూ కొందరు సంపూర్ణేష్ బాబును తక్కువ చేసి మాట్లాడారట. నువ్వు చాలా లక్కీ అంటూ సంపూపై వ్యంగ్యాస్త్రాలు సంధించారట. 
 
ఈ పరిణామాలన్నీ అతనిని తీవ్రంగా బాధించాయట. అయితే ఏదేమైనా సంపూ షో నుంచి బయటికొచ్చే సమయంలో వ్యక్తం చేసిన భావోద్వేగాలు వీక్షకులను టీవీలకు అతుక్కుపోయేలా చేసి రేటింగ్‌ పెరిగేలా చేశాయట. ఇక సూటిపోటి మాటలు భరించడం తన వల్ల కాక షో నుంచి బయటికొచ్చేసినట్లు టాక్.