శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : గురువారం, 20 జులై 2017 (10:42 IST)

సంఘమిత్రలోనూ కట్టప్ప హీరోనే.. సత్యరాజ్ ఇంకా ఓకే చేయలేదా?

బాహుబలి చిత్రంలో కథానాయకుడికి సమమైన బలం గల సేనానిగా, రాజకుటుంబానికి విశ్వాస పాత్రుడిగా కనిపించిన కట్టప్ప.. సంఘమిత్రలోనూ కీలక పాత్ర పోషిస్తారని తెలుస్తోంది. ఇంతవరకూ తాను చేసిన పాత్రల్లో కంటే కట్టప్ప పా

బాహుబలి చిత్రంలో కథానాయకుడికి సమమైన బలం గల సేనానిగా, రాజకుటుంబానికి విశ్వాస పాత్రుడిగా కనిపించిన కట్టప్ప.. సంఘమిత్రలోనూ కీలక పాత్ర పోషిస్తారని తెలుస్తోంది. ఇంతవరకూ తాను చేసిన పాత్రల్లో కంటే కట్టప్ప పాత్ర ప్రత్యేకమని సత్యరాజే చెప్పారు. సత్యరాజ్ కట్టప్ప పాత్రలో ఒదిగిపోయారు. 
 
బాహుబలితో మంచి క్రేజ్ సంపాదించిన సత్యరాజ్‌ను, 'సంఘమిత్ర' సినిమా కోసం ఎంపిక చేయడానికి విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి.  బాహుబలి ద్వారా ఆయనకు వచ్చిన క్రేజ్‌ను ఉపయోగించుకోవాలని సంఘమిత్ర  దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. అయితే సత్యరాజ్ ఇంకా సంఘమిత్రకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో కథానాయికగా హన్సిక పేరు వినిపిస్తోంది. ఆర్య, జయం రవి ఈ చిత్రంలో కీలక పాత్రలకు ఎంపికైనారు.