గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: మంగళవారం, 20 జులై 2021 (18:17 IST)

తనకు జరిగినట్లు మరొకరికి జరగకూడదని సంచలన నిర్ణయం తీసుకున్న షకీలా..?

మూకీ, టాకీ కలర్స్ అంటూ థియేటర్ వ్యవస్ధను దెబ్బకొడుతోంది ఓటిటి. కరోనా వ్యవస్ధను ఆసరాగా చేసుకుని సినిమాను నేరుగా మన ఇంట్లోకి తీసుకువస్తోంది. సినీప్రేక్షకులకు ఇంట్లోనే సినిమాను చూపిస్తూ క్రేజీగా మారుతోంది. అయితే ఇప్పటికే ప్రముఖ ఓటిటిలతో పాటు సెలబ్రిటీలు కూడా సొంత ఓటిటిల వెంటపడుతున్నారట.
 
తమకంటూ ఒక ఓటీటీ ఛానల్‌ను క్రియేట్ చేసుకుంటూ తనదైన కంటెంట్‌తో ప్రేక్షకులను అలరించాలనుకుంటున్నారు. ఇప్పటికే ఆర్జీవీ ఇదే అనుకుని ఒక ఓటీటీని ఇట్లే పెట్టేశారు. పెట్టడమే కాదు ఒక అరడజను సినిమాలను పెట్టేసి యూత్‌లో మంచి క్రేజ్ పట్టేశారు.
 
ఈయన దారిలోనే నడుస్తానంటూ ఈ మధ్యలోనే ప్రకటించారు నమిత. స్పెషల్ ఎంటర్ టైన్మెంట్ కావాలనుకునేవారి కోసం. అప్ కమింగ్ కళాకారులను ఎంకరేజ్ చేయడం కోసం తనే స్వయంగా సినిమాలను, సీరియళ్ళను నిర్మించిన తన ఓటిటీలోనే స్క్రీన్ చేస్తానంటున్నారు. 
 
ఇక ఇప్పుడు ఆర్జీవీ, నమిత దారిలోనే నడుస్తానంటున్నారు ఒకప్పటి శృంగార తార షకీల. సొంత ఓటీటీని పెట్టేస్తానంటూ పరిశ్రమలో తెగ హల్చల్ చేసేస్తున్నారట. సినిమా రిలీజ్ చేయకుండా ఇబ్బంది పెట్టే పెద్ద మనుషుల నుంచి చిన్న సినిమాలను కాపాడేందుకు బిగ్రేడ్ సినిమాలను సెన్సార్ బోర్డు తిప్పే పంపే సినిమాలను తన ఓటిటిని పెద్ద దిక్కుగా మారుస్తానంటున్నారు షకీల.
 
గతంలో నా సినిమా విడుదల కోసం సెన్సార్ బోర్డు కోసం చాలా తిరిగాను. అయినా కూడా వారు నా సినిమాకు సెన్సార్ ఇవ్వలేదు. నాలాగా మరొకరికి జరగకూడదు. అందుకే ఓటీటీని ప్రారంభిస్తున్నానని షకీల చెబుతోంది.