శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : గురువారం, 6 జులై 2017 (14:49 IST)

ఆ జోకర్... అధికారాన్ని తప్పుడుదారిలో ఉపయోగిస్తున్నాడు : 'శంకరాభరణం' తులసి

మూవీ ఆర్టీస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజాపై 'శంకరాభరణం'లో నటించిన సీనియర్ నటి తులసి సంచలన ఆరోపణలు చేశారు. శివాజీ రాజాను ఓ జోకర్‌గా ఆమె అభివర్ణించారు.

మూవీ ఆర్టీస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజాపై 'శంకరాభరణం'లో నటించిన సీనియర్ నటి తులసి సంచలన ఆరోపణలు చేశారు. శివాజీ రాజాను ఓ జోకర్‌గా ఆమె అభివర్ణించారు. 
 
దర్శకుడు కె.విశ్వనాథ్‌ను ఆమె గురువుగా ఆరాధిస్తారు. అందుకే ఆయన తీసిన చిత్రం 'శంకరాభరణం' పేరిట ప్రతియేటా ఉత్తమ నటన కనబరిచిన వారికి అవార్డులు ఇస్తుంటారు. ఈ యేడాది కూడా ఈ అవార్డుల పంపిణీ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. 
 
ఈ అవార్డుల కార్యక్రమానికి పలువురు సెలెబ్రిటీలను ఆమె ఆహ్వానించగా, వారిలో చాలా మంది గైర్హాజరయ్యారు. దీనిపై తులసి స్పందిస్తూ... తను తలపెట్టిన ఓ అవార్డుల కార్యక్రమానికి యంగ్‌ టైగర్‌ ఎన్టీయార్‌ను రానీకుండా చేసింది శివాజీరాజా ఆరోపించారు. 
 
'ఆ వేడుకకు సెలబ్రిటీలు రాకపోవడం వెనుక శివాజీరాజా హస్తం ఉంది. "మా" అధ్యక్షుడిగా శివాజీరాజా తన అధికారాన్ని తప్పుడు దారిలో వినియోగిస్తున్నాడు. అతనో జోకర్‌. వేరే వ్యక్తితో కలిసి అతను నా అవార్డుల వేడుకకు అతిథులు రాకుండా అడ్డుకున్నాడని ట్విట్టర్‌ ద్వారా ఆమె ఆరోపించారు.