1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : సోమవారం, 19 సెప్టెంబరు 2016 (13:22 IST)

బయోపిక్‌ల గోల.. సోహా అలీఖాన్ కొత్త వ్యాపారం.. లెజెండ్ జీవిత కథతో..

బాలీవుడ్ నటి సోహా అలీఖాన్ కొత్త వ్యాపారం మొదలెట్టేసింది. బాలీవుడ్‌లో చేసింది కొన్ని చిత్రాలైనా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించుకుంది. ఓ ప్రముఖుడి జీవిత కథ ఆధారంగా తొలి సినిమాను నిర్మించనుంది. భర్త క

బాలీవుడ్ నటి సోహా అలీఖాన్ కొత్త వ్యాపారం మొదలెట్టేసింది. బాలీవుడ్‌లో చేసింది కొన్ని చిత్రాలైనా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించుకుంది. ఓ ప్రముఖుడి జీవిత కథ ఆధారంగా తొలి సినిమాను నిర్మించనుంది. భర్త కునాల్ ఖేముతో కలసి ప్రొడక్షన్ హౌజ్ను నడపనున్నట్టు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇతరులతో కలసి సహ భాగస్వామ్యంతో సినిమాలను నిర్మించనున్నట్టు సోహా వెల్లడించారు. 
 
ఓ లెజెండ్ జీవితకథను తీసుకుని తొలి సినిమా నిర్మిస్తామని, కాగా క్రీడలు, సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తి కథ కాదని స్పష్టం చేశారు. ఈ సినిమాలో తాను నటించడంలేదని చెప్పింది. సంస్థ పేరు రెనెగేట్ ఫిలిమ్స్. కొత్త స్క్రిప్ట్‌లు, డిఫరెంట్ ఆలోచనలతో వచ్చే వారి కోసం మా సంస్థ ఎదురుచూస్తుందని తెలిపారు. సినిమా వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు సోహా అలీఖాన్.