మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : బుధవారం, 4 మే 2016 (10:55 IST)

యుఎస్‌లో 80 స్క్రీన్‌లలో విడుదల కానున్న 'సుప్రీం'

''సుబ్రమణ్యం ఫర్ సేల్'' చిత్రంతో మంచి హిట్ అందుకున్న సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు "సుప్రీమ్'' చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. సాయి ధరమ్ తేజ్, అనిల్ రావి పూడి దర్శకత్వంలో మొదటిసారిగా విడుదలవుతున్న చిత్రం 'సుప్రీమ్'. ఈ చిత్ర యూనిట్ సభ్యులు ప్రొమోషన్స్‌లో బిజీ బిజీగా ఉన్నారు. మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. 
 
ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే యూఎస్ లో 80 స్క్రీన్స్ పై రిలీజ్ కాబోతుంది. ఇప్పటివరకు సాయి ధరమ్ తేజ్ చిత్రం ఇన్ని స్క్రీన్స్ పై ఓవర్సీస్‌లో రిలీజ్ కావడం ఇదే మొదటిసారి. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రం‌లో సాయి ధరమ్ తేజ్ క్యాబ్ డ్రైవర్‌గా, రాశి ఖన్నా పోలీస్ పాత్రను పోషిస్తున్నారు. మిక్కీ.జే.మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే విడుదల అయిన ఆడియోకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే ఈ చిత్రానికి సంబందించిన ప్రమోషన్స్ కూడా భారీ రేంజ్ లో చేస్తూ దిల్ రాజు ఈ చిత్రం పై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాడు.