గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: బుధవారం, 7 జూన్ 2017 (18:15 IST)

ప్రభాస్ నాకూ మధ్య ఏదో వుందని రాస్తే ఏం చేస్తానో తెలుసా? అనుష్క పప్పన్నం పెడితే...

బాహుబలి చిత్రంలో దేవసేనగా నటించిన అనుష్క తొలిసారిగా గాసిప్స్ పైన మాట్లాడింది. ఇది కూడా తన పెళ్లి గురించి వస్తున్న రూమర్ల పైన. తన సహనటుడు ప్రభాస్ ని పెళ్లి చేసుకోబోతోందంటూ వస్తున్న రూమర్ల పైన ఆమె మండిపడింది. ప్లీజ్... దయచేసి ఇలాంటి గాలి వార్తలను రాయడం

బాహుబలి చిత్రంలో దేవసేనగా నటించిన అనుష్క తొలిసారిగా గాసిప్స్ పైన మాట్లాడింది. ఇది కూడా తన పెళ్లి గురించి వస్తున్న రూమర్ల పైన. తన సహనటుడు ప్రభాస్ ని పెళ్లి చేసుకోబోతోందంటూ వస్తున్న రూమర్ల పైన ఆమె మండిపడింది. ప్లీజ్... దయచేసి ఇలాంటి గాలి వార్తలను రాయడం ఆపేయండి. ప్రభాస్ కేవలం నాకు సహ నటుడు మాత్రమే. 
 
అంతకుమించి మా ఇద్దరి మధ్య ఏమీ లేదు. నేను ఇలా చెప్పిన తర్వాత కూడా ఇంకా ఇలాంటి రూమర్లు సృష్టిస్తే మాత్రం చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు ప్రొసీడ్ అవుతానంటూ ఆమె వెల్లడించారు. పెళ్లి కాని వారి విషయంలో ఇది ఎంతో బాధించే విషయమే. ఇక ప్రభాస్ సంగతి సేమ్ టు సేమ్. 
 
తనపాటికి తను సినిమాలు చేసుకుంటూ పోతుంటే మధ్యలో ఈ రొద ఏమిటని ప్రభాస్ ఫీలవుతున్నారట. ఇదంతా ఎందుకూ... ఇద్దరూ త్వరగా తమకు నచ్చినవాళ్లను పెళ్లి చేసేసుకుంటే ఈ రూమర్లకు స్టాప్ పడుతుంది కదా అంటున్నారు సినీజనం. మరి... ఎవరు ముందుగా పప్పన్నం(పెండ్లి భోజనం) పెడతారో...?