ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : సోమవారం, 30 జనవరి 2017 (08:38 IST)

ఇన్నాళ్లూ.. ఆ పిల్లను మిస్సయ్యాం.. ఆమె అందం అదరహో అంటున్న నిర్మాతలు!

బేసిగ్గా హైదరాబాద్ అయిన నటి టబు.. బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తన మార్క్ నటనతో పాటు... అందాలను ఆరబోసి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. ఇపుడు ఇదే కోవలో మరో

బేసిగ్గా హైదరాబాద్ అయిన నటి టబు.. బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తన మార్క్ నటనతో పాటు... అందాలను ఆరబోసి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. ఇపుడు ఇదే కోవలో మరో హీరోయిన్ చేరింది. ఆమె పేరు అతిది రావ్ అలియాస్ అతిది.  త్వరలో టాలీవుడ్ ప్రేక్షకులని తన గ్లామర్‌తో ఫిదా చేయడానికి రెడీ అయ్యింది.
 
దర్శకుడు మణిరత్నం మళ్ళీ ఫాంలోకి వచ్చి చేస్తున్న లవ్ స్టోరీ 'చెలియా'. ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. కార్తీ హీరోగా తెరకెక్కిన ఈ మూవీలో హీరోయిన్ కోసం చాలా ఆడిషన్లు చేసిన మణిరత్నం చివరికి అదితిని ఫిక్స్ చేశాడు. దాంతో బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేసి సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఈమెకి బంపరాఫర్ తగిలింది.
 
బేసిగ్గా హైదరాబాదీ అయిన ఈ బ్యూటీ, బాలీవుడ్‌ తర్వాత ఇప్పుడు సౌత్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. టబులాగానే అదితికి కూడా కనిపిస్తోందని చర్చించుకుంటున్నారు సినీ లవర్స్. రీసెంట్‌గా రిలీజ్ అయిన 'చెలియా'టీజర్‌లో అదితిని చూసిన టాలీవుడ్ డైరెక్టర్లు ఇన్నాళ్ళు ఈమెని ఎలా మిస్సయ్యామని ఒకరితో ఒకరు చర్చించుకుంటున్నారట.