జ్యోతిలక్ష్మీ ఈవెంట్ కోసం కెల్విన్‌కు పూరీ డబ్బులిచ్చారా? అరెస్ట్ చేయరట..
టాలీవుడ్‌ను షేక్ చేసిన డ్రగ్స్ కేసులో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ సిట్ విచారణకు హాజరయ్యారు. బుధవారం (19)న డైరెక్టర్ పూరీని సిట్ ముందు హాజరయ్యారు. డ్రగ్స్ కేసులో పూరీ జగన్నాథ్ సహా 12మంది సినీ ప్రము
టాలీవుడ్‌ను షేక్ చేసిన డ్రగ్స్ కేసులో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ సిట్ విచారణకు హాజరయ్యారు. బుధవారం (19)న డైరెక్టర్ పూరీని సిట్ ముందు హాజరయ్యారు. డ్రగ్స్ కేసులో పూరీ జగన్నాథ్ సహా 12మంది సినీ ప్రముఖులకు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ డ్రగ్స్ కేసులో ఈనెల 19 నుంచి 27 వరకు ఎక్సైజ్‌శాఖ అనుమానిత ఫిల్మ్‌స్టార్స్ వద్ద విచారణ మొదలెట్టింది. ఇటీవల పట్టుబడిన డ్రగ్ రాకెట్ కేసులో సుమారు 12 మందిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఎల్ఎస్‌డీ, ఎండీఎంఏ మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో డ్రగ్స్ వ్యవహారంలో సిట్ అధికారుల విచారణ ఎదుర్కొంటున్న దర్శకుడు పూరీ జగన్నాథ్ పలు విషయాలు చెప్పినట్టు సమాచారం.
కెల్విన్ బ్యాంక్ అకౌంట్‌కు పూరీ డబ్బులు పంపిన ఆధారాలను, అతనితో ఉన్న ఫొటోలను పూరీ జగన్నాథ్‌కు అధికారులు చూపించినట్టు సమాచారం. పూరీ, ఛార్మీ కాంబోలో వచ్చిన 'జ్యోతిలక్ష్మి' ఈవెంట్ కోసం కెల్విన్‌కు తాను డబ్బులు ఇచ్చానని అధికారులతో పూరీ చెప్పినట్టు సమాచారం. కెల్విన్ తెలిసినప్పటికీ, డ్రగ్స్ ముఠాతో ఎలాంటి సంబంధం లేదని పూరీ ఇప్పటికే అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. పూరీ ద్వారానే ఛార్మి, రవితేజకు డ్రగ్ ముఠాతో సంబంధాలు ఏర్పడినట్టు అధికారులు భావిస్తున్నారు. దీంతో పూరీని అరెస్ట్ చేయరని సమాచారం.