శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : శనివారం, 30 సెప్టెంబరు 2017 (14:14 IST)

రాజమౌళి తదుపరి ప్రాజెక్టు మగధీర సీక్వెల్...?

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శత్వంలో వచ్చిన ఆణి ముత్యాల్లో "మగధీర" ఒకటి. ఈ చిత్రం సీక్వెల్ రానుంది. అంటే 'బాహుబలి 2' చిత్రం తరహాలోనే 'మగధీర 2' చిత్రం తెరకెక్కనుంది. రాజమౌళి దర్శకత్వంలో, మెగా పవర్ స్ట

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శత్వంలో వచ్చిన ఆణి ముత్యాల్లో "మగధీర" ఒకటి. ఈ చిత్రం సీక్వెల్ రానుంది. అంటే 'బాహుబలి 2' చిత్రం తరహాలోనే 'మగధీర 2' చిత్రం తెరకెక్కనుంది. రాజమౌళి దర్శకత్వంలో, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రంలో హీరోగా నటించనున్నాడు. దీనికి సంబంధించిన ఓ వార్త ఇపుడు ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. 
 
ఇటీవల ఒక సందర్భంగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, 'మగధీర' సినిమాకు సీక్వెల్ తీయాలని ఉందని అన్నారు. దీంతో 'మగధీర-2' రూపకల్పనకు రాజమౌళి పూనుకుంటున్నాడని ఫిల్మ్ నగర్ కథనాలు చెబుతున్నాయి. ఒకవేళ ఈ కథ కాకపోయినా, రాజమౌళి తర్వాతి ప్రాజెక్టు మాత్రం రాంచరణ్‌తోనే ఉంటుందని భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ లేదా రాం చరణ్ నిర్మించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.