శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 21 సెప్టెంబరు 2017 (11:27 IST)

రంగస్థలం సినిమా సెట్‌లో చిరంజీవి, రాజమౌళి.. ఫోటోలు వైరల్

''రంగస్థలం 1985'' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సుకుమార్ దర్శకత్వంలో చెర్రీ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ జూబ్లీహిల్స్ జరుగుతోంది. 'రంగస్థలం 1985'లో సమంత హీరోయిన్‌గా నటిస్తున్నారు. అనసూయ, జగప

''రంగస్థలం 1985'' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సుకుమార్ దర్శకత్వంలో చెర్రీ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ జూబ్లీహిల్స్ జరుగుతోంది. 'రంగస్థలం 1985'లో సమంత హీరోయిన్‌గా నటిస్తున్నారు. అనసూయ, జగపతిబాబు, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 
 
మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. 1985 నాటి పరిస్థితులు ప్రతిబింబించేలా ఈ చిత్రం కోసం రూ. 5 కోట్లతో సెట్‌ను కూడా వేశారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
 
ఈ నేపథ్యంలో సినిమా సెట్‌లో మెగాస్టార్‌ చిరంజీవి, జక్కన్న ఎస్‌.ఎస్‌. రాజమౌళి సందడి చేశారు. మంగళవారం సెట్‌కు వెళ్లిన వీరిద్దరు యూనిట్‌ సభ్యులతో కాసేపు సరదాగా గడిపినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మగధీర తర్వాత చెర్రీ-జక్కన్న కాంబోలో మరో సినిమా వచ్చే అవకాశం ఉన్నట్లు వదంతులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెర్రీ సినిమా సెట్‌కు జక్కన్న వెళ్లడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.