గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 సెప్టెంబరు 2023 (17:01 IST)

బ్యాచిలర్ లైఫ్‌కు బైబై.. ఫ్రెండ్స్‌కు వరుణ్ తేజ్ పార్టీ

Varun Tej
మెగా హీరో వరుణ్ తేజ్ బ్యాచిలర్ లైఫ్‌కు త్వరలో ముగింపు పలకనున్నారు. ఇందుకోసం తన స్నేహితులకు వరుణ్ తేజ్ బ్యాచిలర్ పార్టీ ఇస్తున్నాడు. స్పెయిన్‌లో తన స్నేహితులతో కలిపి పార్టీని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ పార్టీకి 40 మంది స్నేహితులు హాజరయినట్టు సమాచారం. 
 
హీరోయిన్ లావణ్య త్రిపాఠిని మెగా హీరో వరుణ్ తేజ్ పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. వీరి ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరిగింది. ఇటలీలో వీరి డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోబోతున్నారని టాక్ వస్తోంది. నవంబర్ మొదటి వారంలో పెళ్లి ఉంటుందని టాక్ వస్తోంది.