పెళ్లికి సిద్ధం అయిన సీనియర్ హీరోయిన్ రాధ కుమార్తె
సీనియర్ హీరోయిన్ రాధ కుమార్తె పెళ్లికి సిద్ధం అయ్యింది. తాజాగా ఇన్‌స్టాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న కార్తీక వీడియో, ఫొటోలే ఇందుకు కారణం. ఈ వీడియోలో కార్తీక సంప్రదాయిక దుస్తుల్లో మెరిసిపోయింది. మరో ఫొటోలో ఆమె చేతికున్న ఉంగరం స్పష్టంగా కనిపించింది.
ఈ విషయంలో కార్తీక, ఆమె తల్లి రాధ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కార్తీక తెలుగులో నాగచైతన్య నటించిన "జోష్" సినిమాలో హీరోయిన్‌గా పరిచయమైంది.
జూనియర్ ఎన్టీఆర్ సరసన "దమ్ము"లో ఆమె తళుక్కుమన్నా కూడా ఆ తరువాత ఆమెకు ఆశించిన మేర అవకాశాలు రాలేదనే చెప్పాలి. ప్రస్తుతం నెట్టింట వార్త వైరల్ అవుతోంది.