గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 21 డిశెంబరు 2018 (12:30 IST)

చైతు కోసం విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ రెడీ... ఏ త‌ర‌హా చిత్ర‌మో తెలుసా..?

అక్కినేని నాగ చైతన్య న‌టించిన శైల‌జారెడ్డి అల్లుడు, స‌వ్య‌సాచి చిత్రాలు ఆశించిన స్థాయిలో విజ‌యాలు సాధించ‌క‌పోవ‌డంతో బాగా డీలా పడ్డాడు. అయితే.. ఇక నుంచి కెరీర్లో ఆచితూచి అడుగులు వేయాల‌నుకుంటున్నాడట‌. అందుక‌నే క‌థ‌ల ఎంపిక‌లో చాలా కేర్ తీసుకుంటున్నాడ‌ట‌. అంతేకాకుండా క్రేజీ ప్రాజెక్ట్స్ చేసేందుకు బాగా ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నాడ‌ట‌. ఇదిలాఉంటే... చైత‌న్య కోసం స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ఓ మంచి లవ్ స్టోరీ రాస్తున్నానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. 
 
అయితే తాజా సమాచారం ప్రకారం... ఈ స్క్రిప్ట్ పూర్తయిందట. బాక్సాఫీస్ వద్ద కాస్త వెనుక పడిన చైతూకి ఎలాగైన ఓ మంచి స్క్రిప్ట్ అందివ్వాలనే ఉద్దేశ్యంతో విజయేంద్ర ప్రసాద్ ఈ స్క్రిప్ట్ రాసారట‌. కాగా ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారో అనేది ఇంకా తెలియాల్సి ఉంది. 
 
నాగ చైతన్య ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో తన సతీమణి సమంతతో కలిసి మజిలీ చిత్రం షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్నారు. చైతు, సమంత పెళ్లి తర్వాత కలిసి నటిస్తున్న తొలి చిత్రం మజిలీనే కావడంతో ఆ చిత్రంపై అక్కినేని అభిమానులు చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. మ‌రి.. ఈ మ‌జిలీ ఎలాంటి ఫ‌లితాన్ని అందిస్తుందో..?