నాగ్ - చైతు మూవీ ఫిక్స్..!
టాలీవుడ్ కింగ్ నాగార్జున దేవదాస్ సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ... ఆశించిన స్ధాయిలో విజయం సాధించలేదు. హిందీ, తమిళ్‌లో మల్టీస్టారర్ మూవీస్‌లో నటిస్తున్నాడు కానీ.. తెలుగులో నటించే తదుపరి చిత్రాన్ని ఎనౌన్స్ చేయలేదు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి ప్రీక్వెల్ చేయనున్నట్టు గత కొన్ని రోజులు వార్తలు వస్తున్నాయి. అలాగే చిలసౌ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్లో కూడా సినిమా చేయనున్నట్టు ప్రకటించారు.
లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. నాగార్జున కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో సోగ్గాడే చిన్ని నాయనా ప్రీక్వెల్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇందులో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా నటించనున్నాడు. ఇటీవల కళ్యాణ్ కృష్ణ చెప్పిన లైన్‌కి నాగ్ ఓకే చెప్పాడట. త్వరలోనే ఈ సినిమాని ఎనౌన్స్ చేయనున్నారు అని తెలిసింది.
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైన నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. మరి... ఈ సినిమా కూడా అలాంటి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.