గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
Last Updated : శనివారం, 10 అక్టోబరు 2015 (20:54 IST)

ప్రియా ఆనంద్ - రానా దోస్తీ అలాగే కొనసా..........గుతోందట..!!

లీడర్ చిత్రంలో రానా సరసన నటించి అమ్మాయి ప్రియా ఆనంద్ గుర్తుందా..? మీకు గుర్తున్నా లేకపోయినా రానాకు మాత్రం బాగా గుర్తున్నదట. ఎందుకంటే లీడర్ చిత్రం దగ్గర్నుంచీ వాళ్లిద్దరూ మంచి స్నేహితులైపోయారట. అందుకే ఆమెకు బాగా సహాయం చేస్తున్నాడు.

తాజాగా ప్రియను బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి రికమెండ్ చేశాడట రానా. రానా రికమెండేషన్ అంటే మాటలా.. వెంటనే ప్రియా ఆనంద్‌కు ఆఫర్లు తన్నుకుంటూ వస్తున్నాయట. బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరైన పశు భగ్నానీ ప్రియకు ఏకంగా మూడు సినిమాలకు అవకాశం ఇచ్చి సంతకాలు చేయించుకున్నాడట.

రానా ఒక్క మాటతో ఇంతటి రేంజ్‌లో తనకు అవకాశాలు వస్తుండటంతో ప్రియా ఆనంద్ చిందులేస్తోందట. రానా ఎక్కడున్నా దగ్గరకెళ్లి మరీ కృతజ్ఞతలు చెప్పాలనుకుంటోందట.