మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Updated : సోమవారం, 8 మే 2017 (17:53 IST)

'బాహుబలి'ని పిచ్చిపిచ్చిగా చూస్తున్న జనం... చూడకపోతే తప్పేమో...? సీఎం బాబు

బాహుబలి ది కంక్లూజన్ చిత్రాన్ని ప్రేక్షకులు పిచ్చిపిచ్చిగా చూస్తున్నారు. అంటే... చూసినవారే మళ్లీమళ్లీ చూస్తున్నారు. మరో సినిమా కంటే బాహుబలి బెటర్ అనే దృష్టితో మళ్లీ అదే సినిమాను కొందరు చూస్తుంటే... ఒక

బాహుబలి ది కంక్లూజన్ చిత్రాన్ని ప్రేక్షకులు పిచ్చిపిచ్చిగా చూస్తున్నారు. అంటే... చూసినవారే మళ్లీమళ్లీ చూస్తున్నారు. మరో సినిమా కంటే బాహుబలి బెటర్ అనే దృష్టితో మళ్లీ అదే సినిమాను కొందరు చూస్తుంటే... ఒక్కసారే కాదు రెండోసారి కూడా చూసి తృప్తి చెందాలన్న భావనతో మళ్లీ కొందరు చూస్తున్నారు. మరికొందరు... ఈ బాహుబలి2 చిత్రం మళ్లీ థియేటర్లలో ఇంత గ్రాండ్ గా చూడలేం... ఏ టీవీల్లోనో చూడాల్సి వస్తుంది. కనుక ఇప్పుడే రెండుమూడుసార్లు చూసేద్దాం అనుకుంటూ మళ్లీమళ్లీ చూసేస్తున్నారు. 
 
ఈ విధంగా ప్రేక్షక జనం బాహుబలి2ని ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. ఇదే ట్రెండ్ ఈ వారం కూడా నడిస్తే బాహుబలి రూ. 1500 కోట్లకు చేరుకోవడం ఖాయం అంటున్నారు. ఈ రికార్డును చెరిపేయడం మరి ఏ ఇండియన్ డైరెక్టర్ కు సాధ్యమవునా అన్నంతగా బాహుబలి 2 దూసుకువెళుతోంది. 
 
మరోవైపు అమెరికా పర్యటనలో వున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బాహుబలి చిత్రం, ఆ చిత్ర దర్శకుడు రాజమౌళిని పొగడ్తల వర్షం కురిపించారు. తెలుగు బిడ్డ ఇండియన్ సినీ చరిత్రలో రికార్డు సృష్టించడం అభినందనీయమన్నారు. బాహుబలి చిత్రం చూడకుండా మిస్ చేస్తే తప్పు చేసినట్లు ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఫీలవుతున్నారంటూ ఆయన అన్నారు.